- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాముడు నా కలలోకి వచ్చాడు- అయోధ్య ఈవెంట్ పై తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలు
అయోధ్య రామాలయం ప్రతిష్ఠపై సంచలన వ్యాఖ్యలు చేశారు బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్. అయోధ్య విషయంలో బీజేపీపై విమర్శలు గుప్పించారు.

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామాలయం ప్రతిష్ఠపై సంచలన వ్యాఖ్యలు చేశారు బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్. అయోధ్య విషయంలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు అయిపోగానే రాముడ్ని మర్చిపోతారు.. జనవరి 22న రాముడు రావడం తప్పనిసరి కదా? అని ప్రశ్నించారు. నలుగురు శంకరాచార్యులకు వచ్చినట్లు తన కలలోనూ రాముడు వచ్చారని తెలిపారు. కపటత్వం ఉంది కాబట్టి ప్రతిష్ఠకు రానని రాముడు చెప్పినట్లు తెలిపారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన నాలుగు మఠాల పీఠాధిపతుల గురించి సమావేశంలో ప్రస్తావించారు. బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్.. ప్రస్తుతం రాష్ట్రీయ జనతాదళ్ కు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించాల్సి ఉంది. మరోవైపు బిహార్ బీజేపీ నాయకులు కూడా తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఎలాంటి కామెంట్లు చేయలేదు.
మరోవైపు గతంలో బిహార్ మంత్రి ఒకరు అయోధ్య ఈవెంట్ పై కామెంట్లు చేశారు. మతంపై ప్రకటనలు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలని ప్రజలను కోరారు. మానవత్వాన్ని ప్రధాన మతంగా చూడాలని కోరారు. ప్రజలు అనారోగ్యానికి గురైత్ గుడికి వెళ్లేకంటే.. హాస్పిటల్ వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలని.. ప్రజలకు సూచించాలని బిహార్ మంత్రి చంద్రశేఖర్ కు సూచించారు.






