రాఖీ పండుగ స్పెషల్.. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-04 08:40:18  IST  )

రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. పండుగ సమయంలో అక్కాచెల్లెళ్లకు ప్రత్యేక బహుమతిని అందిస్తున్నట్లు ప్రకటించారు సీఎం యోగీ ఆదిత్యనాథ్. యూపీఎస్ఆర్టీసీ, సిటీ బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రాఖీ పండుగ స్పెషల్.. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..
X

దిశ, వెబ్ డెస్క్: రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. పండుగ సమయంలో అక్కాచెల్లెళ్లకు ప్రత్యేక బహుమతిని అందిస్తున్నట్లు ప్రకటించారు సీఎం యోగీ ఆదిత్యనాథ్. యూపీఎస్ఆర్టీసీ, సిటీ బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల ఎనిమిదో తారీఖు ఉదయం నుంచి 10వ తేదీ మధ్నాహ్నం పన్నెండు గంటల వరకు ఫ్రీ సర్వీసు అందించనున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగినన్ని బస్సులు నడపాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తున్న స్త్రీలకు ఈ ప్రకటన సంతోషాన్ని ఇచ్చింది. అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లకు ప్రత్యేకమైన ఈ పండుగను మరింత ప్రత్యేకంగా మార్చారని అంటున్నారు.

Next Story