- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీ చెప్పిందే రైతులు అడుగుతున్నారు.. రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్
by Javid Pasha |
ప్రధాని మోడీ ఇచ్చిన హామీనే రైతులు ఇవాళ డిమాండ్ చేస్తున్నారని రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ ఇచ్చిన హామీనే రైతులు ఇవాళ డిమాండ్ చేస్తున్నారని రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు. కనీసం మద్ధతు కోసం పోరాటం చేసున్న రైతులను కలిసిన రాకేశ్ టికాయత్ వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు కనీస మద్ధతు ధర ప్రకటిస్తామని గతంలో ప్రధాని మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇవాళ అదే విషయమై రైతులు ధర్నా చేస్తున్నారని అన్నారు. కనీసం మద్ధతు ధర విషయంలో హర్యాణా సీఎం స్పందించడం లేదని, అందుకే వేల మంది రైతులు రోడ్లమీదకు వచ్చి ధర్నా చేస్తున్నారని చెప్పారు. కనీస మద్ధతు ధర సాధించే వరకు రైతుల పోరాటం ఆగదని, ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఓడిపోయేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటికైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కనీస మద్ధతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story






