- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rajya Sabha: రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ నివేదిక.. విపక్ష సభ్యుల ఆందోళన

దిశ, వెబ్‌డెస్క్: వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill)పై జేపీసీ (JPC) నివేదికను కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే సభలో విపక్ష సభ్యలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. సభను మందుకు సాగనివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ (Rajya Sabha Chairman Jagdeep Dhankar) సభను సజావుగా నడవనివ్వాలని సభ్యులను కోరారు. అయితే, వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మత వ్యవహారాలను ఆచరించడంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 కింద పౌరులకు లభించిన స్వేచ్ఛకు జేసీపీ (JPC) నివేదిక విరుద్ధమని మండిపడ్డారు.
హిందువుల దేవాదాయ-ధర్మాదాయ పరిషత్తులు, సిక్కుల బోర్డులు, క్రైస్తవుల బోర్డుల్లో ఆయా మతాల వారు తప్పిస్తే వేరే మతాల వారు లేనప్పుడు ముస్లింల విషయంలోనే అలా చేయాలనుకోవడం ఏంటని విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డులను నాశనం చేసే ఉద్దేశంతోనే కేంద్ర ఈ పని చేస్తోందని ఆయన మండిపడ్డాయి. నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అన్ని పార్టీ సభ్యులు లేఖలు ఇచ్చినప్పటికీ బయట వ్యక్తులను ఇచ్చిన సూచనలు, సలహాలను జేపీసీ (JPC) నివేదికలో పొందుపరచడం ఏంటని ఫైర్ అయ్యారు. తాము విద్యావంతులము కాదా.. చదువుకోలేదా అని మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సీరియస్ అయ్యారు.
ముస్లింలకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులను హరించేందుకే చట్ట సవరణను తీసుకొస్తున్నారని ఆ కమ్యూనిటీ సభ్యులు ఆరోపించారు. వక్ఫ్‌బోర్డుల పనితీరులో జోక్యం చేసుకోవడమే కేంద్ర ప్రభుత్వ అసలు ఉద్దేశమని వారు ఆరోపించారు. విపక్ష సభ్యుల ఆందోళణ మధ్యే రాజ్యసభ (Rajya Sabha) కొనసాగుతోంది. కాగా, వక్ఫ్ సవరణ బిల్లును పరిశీలించడానికి ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee) తమ నివేదికను 15-11 ఓట్ల మెజార్టీతో ఆమోదించింది. బీజేపీ (BJP) సభ్యులు ప్రతిపాదిస్తున్న మార్పులను జేపీసీ నివేదికలో చేర్చడంతో రాజ్యసభలో రచ్చ మొదలైంది.