ఏదైనా తేడా చేశారో ఈ సారి మామూలుగా ఉండదు.. పాక్‍కు రాజ్‌నాథ్‌ హెచ్చరిక

by Prasad Jukanti |

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల్లో భారత్‌పై ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే పాక్‌కు తగిన బుద్ధి చెబుతామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.

ఏదైనా తేడా చేశారో ఈ సారి మామూలుగా ఉండదు.. పాక్‍కు రాజ్‌నాథ్‌ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను అసరాగా చేసుకుని తమపై ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఈసారి ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్‍ను పరోక్షంగా హెచ్చరించారు. ఇవాళ కేరళంలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‍ను గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తవుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన పొరుగు దేశం ఏమైనా కవ్వింపు చర్యలకు పాల్పడవచ్చు. ఒకవేళ అదే జరిగితే భారత్ రియాక్షన్ ఊహించని రీతిలో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాద చర్యల విషయంలో భారత్ అవలంభిస్తున్న విధానాన్ని ఆయన గుర్తు చేశారు. ఉరి సెక్టార్ దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, పహల్గాం దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయాన్ని రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేశారు.

Next Story