- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > Rajnath Singh : మహా కుంభమేళాకు రాజ్‌నాథ్ సింగ్.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం
Rajnath Singh : మహా కుంభమేళాకు రాజ్‌నాథ్ సింగ్.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం
by B.Srinivas |
ఆరు రోజుల్లో త్రివేణి సంగమం వద్ద సుమారు 7.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు తెలిపారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో మహాకుంభమేళా కొనసాగుతోంది. ఆరు రోజుల్లో త్రివేణి సంగమం వద్ద సుమారు 7.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు తెలిపారు. రాజకీయ ప్రముఖుల నుంచి సెలబ్రిటీల వరకు భారీగా కుంభమేళాకు తరలివస్తున్నారు. శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) కుంభమేళాకు హాజరయ్యారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. రాజ్‌నాథ్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మహాకుంభ్‌లో స్నానం చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మహాకుంభ్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్‌ను అభినందించారు. పెరుగుతున్న సందర్శకుల సంఖ్యకు అనుగుణంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మరిన్ని విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
Next Story






