- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హద్దుమీరితే ఇదే సమాధానం.. సహనాన్ని పరీక్షించొద్దు: రాజ్‌నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్‌తో తాము కేవలం ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేశామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. తమ సహనాన్ని పరీక్షించాలని చూడొద్దని వార్నింగ్ ఇచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: అత్యంత కచ్చితత్వంతో భారత దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతం చేశాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అందుకని ఇతరులు హద్దుమీరి రెచ్చగొడితే ‘ఆపరేషన్ సిందూర్’ వంటి పర్యవసనాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ‘నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఆపరేషన్ సిందూర్‌ను ఇంత కచ్చితత్వంతో పూర్తిచేయడం నిజంగా గొప్ప విషయం. 9 టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేశాం. ఎంతోమంది ఉగ్రవాదులు ఈ దాడిలో హతమయ్యారు. మరణించిన వారిలో సామాన్య ప్రజలెవరూ లేరు. ఆస్తి నష్టం కూడా చాలా తక్కువే జరిగింది. భారత దళాలు అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించడం వల్లనే ఇది సాధ్యమైంది’ అని రాజ్‌నాథ్ తెలిపారు.
‘మేం చర్చల ద్వారానే సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని చూస్తాం. అందుకని మా సహనాన్ని దుర్వినియోగం చేయాలనుకోవాలని చూస్తే ఇలాగే మంచి నాణ్యమైన సమాధానం వస్తుంది జాగ్రత్త’ అని పాకిస్తాన్‌ను పరోక్షంగా హెచ్చరించారు.






