రాష్ట్రంలో భారీ స్కామ్.. నకిలీ సర్టిఫికేట్లతో వందల ప్రభుత్వ ఉద్యోగాలు

by Sujitha Rachapalli |

* రాష్ట్రంలో భారీ స్కామ్ * డిసెబిలిటీ కోటాను ఉపయోగించుకుని జాబ్స్ పొందిన వైనం * నకిలీ సర్టిఫికేట్లతో వందల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు * మోసపోయిన నిజమైన డిజెబుల్ కోటా ఆస్పిరెంట్స్

రాష్ట్రంలో భారీ స్కామ్.. నకిలీ సర్టిఫికేట్లతో వందల ప్రభుత్వ ఉద్యోగాలు
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్‌లో భారీ జాబ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్, 2016 ప్రకారం ఇచ్చిన రిజర్వేషన్ కోటాను దారుణంగా దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కోటా కింద నిజమైన వికలాంగులకు లాభం చేకూరాలి కానీ రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని, అధికారాన్ని వినియోగించుకుని నకిలీలు ఉద్యోగం పొందిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ జరిపిన స్టడీలో ఫస్ట్ ఫేజ్‌లో 29 మందికి 24 మంది ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారని తేలింది. సీరోహీ జిల్లాలో ఇంకా దాదాపు 5,177 సర్టిఫికెట్లు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇందులో టీచర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ సర్వెంట్లు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

ముఖ్యంగా తహిసీల్దార్ కాంచన చౌహాన్ స్టోరీ వైరల్ అవుతోంది. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎలాగైనా క్లియర్ చేయాలనుకుని తపించిన ఆమె తన కలను నెరవేర్చుకోలేకపోయింది. దీంతో డిసెబిలిటీ కోటా కింద తన డ్రీమ్ ఫుల్ ఫిల్ చేయాలనుకుంది. ఈ క్రమంలోనే తనకు వినికిడి లోపం ఉందని గుర్తించింది. కానీ అది ఎనిమిది శాతం మాత్రమే కాని 40శాతం ఉండాలి. దీంతో ప్రముఖ డాక్టర్‌తో 40 ప్లస్ వినికిడి లోపం ఉన్నట్లు సర్టిఫికేట్ ఇష్యూ చేయించుకుంది. 2024లో RAS క్లియర్ చేసింది. అయితే తన తండ్రి, బీజేపీ ఎమ్మెల్యే శంకర్ సింగ్ రావత్ హస్తం ఇందులో ఉందని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆయన కొడుకును పెళ్లి చేసుకున్న కోడలు సునీతకు డైవర్సీ కోటా కింద జాబ్ పొందడం విశేషం. ఇలాంటి కేసులు ఇంకా వేలల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

రూ. 50వేల నుంచి రెండు లక్షల వరకు లంచాలు ఇచ్చి అధికారుల నుంచి ఫేక్ సర్టిఫికేట్లు పొందుతున్నట్లు తేలిది. ఈ క్రమంలో నిజమైన వికలాంగులు వందల మంది ప్రభావితమయ్యారు. రాజస్థాన్ విద్యా మంత్రి 50,000కు పైగా PwD ఉద్యోగాలకు స్టేట్ వైడ్ ఆడిట్ ప్రకటించగా.. తప్పుడు ఉద్యోగుల నుంచి ₹10-15 కోట్ల జీతాలు వసూలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తేలింది.

Next Story