పెళ్లి వయసు రాకున్నా సహజీవనం చేయొచ్చు: హైకోర్టు తీర్పు

by Phanindra |

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం చేయొచ్చంటా రాజస్థాన్ హైకోర్టు తీర్పిచ్చింది. యువతీయువకులు మేజర్లయితే చాలని స్పష్టంచేసింది.

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం చేయొచ్చు: హైకోర్టు తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: పెళ్లి వయసు రాకపోయినా.. మేజర్ అయిన ఇద్దరు లివ్-ఇన్ రిలేషన్‌లో ఉండొచ్చని రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భారత్‌లో వివాహ వయసు అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21. అయితే 18 ఏళ్లు నిండిన వారిని మేజర్లుగానే పరిగణిస్తారు. ఈ క్రమంలోనే కోటాలో సహజీవనం చేస్తున్న ఒక 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడు.. తాము అక్టోబర్ 27న లివ్ ఇన్ రిలేషన్ ఒప్పందం చేసుకున్నామని, తమకు పోలీసుల ప్రొటెక్షన్ కావాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అనూప్ ధాంద్.. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ కింద పెళ్లి వయసు రాకపోయినా మేజర్లు అయిన యువతీయువకులు సహజీవనం చేయొచ్చని తీర్పిచ్చారు.

Next Story