Breaking News : మతం మారే వారికి ప్రభుత్వం షాక్

by Muthe.Rajitha |

ఇకపై మతం మారాలి అనుకునే వారికి, వారిని ప్రోత్సహించే వారికి షాకింగ్ న్యూస్ వినిపించింది ప్రభుత్వం.

Breaking News : మతం మారే వారికి ప్రభుత్వం షాక్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇకపై మతం మారాలి అనుకునే వారికి, వారిని ప్రోత్సహించే వారికి షాకింగ్ న్యూస్ వినిపించింది ప్రభుత్వం. ఇందుకోసం ఏకంగా బిల్లును కూడా రూపొందించింది. బలవంతపు మత మార్పిడులను(Conversion Of Religion) నిరోధించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం(Rajasthan Govt) కఠిన చర్యలకు సిద్ధం అవుతోంది. అందుకోసం బడ్జెట్ సమావేశాల వేదికగా రాజస్థాన్ చట్టవిరుద్ద మతమార్పిడి నిషేధ బిల్లు 2024 (Rajasthan Prohibition OF Unlawfull Conversion Of Religion Bill 2025) ను మంగళవారం సీఎం భజన్ లాల్ శర్మ(CM Bhajan Lal Sharma) ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుపై ఆమోద ముద్ర వేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.

కాగా ఈ బిల్లు ముసాయిదాను 2024 నవంబర్‌లోనే భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని కేబినెట్ ‌ఆమోదించింది. మత మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్నవారు దాదాపు రెండు నెలల ముందు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రమంలో తాము మత మార్పిడి చేసుకోవాలని తమ సొంతంగా నిర్ణయం తీసుకున్నామని జిల్లా ఉన్నతాధికారి ముందు ఒప్పుకోవాల్సి ఉంది. ఇందులో ఎవరి బలవంతం కానీ.. ఎవరి ప్రోద్బలం కానీ లేదని తెలుపాలి. అనంతరం మత మార్పిడికి అనుమతి లభిస్తుంది. అలా కాకుండా షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన వారితోపాటు మహిళలు, మైనర్లను బలవంతంగా మత మార్పిడులకు ప్రోత్సహిస్తే.. రెండు నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 25 వేల వరకు జరిమానా సైతం విధించే విధంగా ఈ బిల్లును రూపొందించారు. కాగా లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి కేకే బిష్ణోయ్(KK Bishnoi) తెలపడం గమనార్హం.

Next Story