Rajasthan Government: కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్స్ కి షాక్

by Shamantha N |

కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్స్ కు షాక్ తగిలింది. బాలీవుడ్‌ నటీనటులు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan), టబు (Tabu), నీలం, సోనాలీ బింద్రేలను నిర్దోషులుగా తేల్చుతూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాజస్థాన్‌ ప్రభుత్వం సవాలు చేసింది.

Rajasthan Government: కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్స్ కి షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్స్ కు షాక్ తగిలింది. బాలీవుడ్‌ నటీనటులు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan), టబు (Tabu), నీలం, సోనాలీ బింద్రేలను నిర్దోషులుగా తేల్చుతూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాజస్థాన్‌ ప్రభుత్వం సవాలు చేసింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. లీవ్-టు-అప్పీల్ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ మనోజ్ కుమార్ గార్గ్ కోర్టులో విచారించారు. ఇదే వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్న మిగతా పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని తెలిపింది. తదుపరి విచారణను జులై 28వ తేదీకి వాయిదా వేసింది.

హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ లో..

1998 అక్టోబర్‌ 1న ‘హమ్‌ సాథ్ సాథ్‌ హై’ చిత్రం షూటింగ్‌ సమయంలో జోధ్‌పుర్‌ పరిసర ప్రాంతాల్లో బాలీవుడ్‌ తారలు కొందరు కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే దీనిపై కేసు (Blackbuck Poaching Case) నమోదైంది. దీనిపై విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు 2018 ఏప్రిల్‌ 5న నటుడు సల్మాన్‌ ఖాన్‌ను (Salman Khan) దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సల్మాన్ హైకోర్టుకు అప్పీల్ చేసుకోవడంతో.. జూలై 25, 2016న అతన్ని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అయితే, రాజస్థాన్ ప్రభుత్వం దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. అదే సమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్‌ అలీఖాన్‌, టబు, సోనాలి బింద్రే, దుష్యంత్‌ సింగ్‌లను తగిన ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదల చేసింది. వీరిని నిర్దోషులుగా విడుదల చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

Next Story