- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Honeymoon Murder: రాజా రఘువంశీ హత్యకు ముందే మరో హత్యకు ప్లాన్ వేసిన సోనమ్
వారు వెళ్లిన ప్రాంతంలో పర్యాటకులు పెద్దగా లేకపోవడంతో అనుకున్నట్టుగా వారి పాచిక పారలేదు.

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ హత్య కేసులో అనేక సంచలనాలు బయటకొస్తున్నాయి. తాజాగా, భర్తను హత్య చేయించిన తర్వాత తాను కూడా హత్యకు గురైనట్టు నమ్మించాలనే ప్లాన్ కూడా వేసినట్టు తెలుస్తోంది. దీనికోసం మరో మహిళను చంపి ఆ మృతదేహాన్ని దహనం చేసి, దాన్ని రఘువంశీ భార్య సోనమ్‌గా చూపించాలని పథకం వేసుకున్నారని, తద్వారా ఆమె నిజానిజాలు తెలిసే వరకు కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండవచ్చనే స్కెచ్ వేసుకున్నారని మేఘాలయ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కానీ, వారు వెళ్లిన ప్రాంతంలో పర్యాటకులు పెద్దగా లేకపోవడంతో అనుకున్నట్టుగా వారి పాచిక పారలేదు. ఈ విషయాలు నిందితులను విచారిస్తున్న క్రమంలో బయటకు వచ్చినట్టు ఎస్పీ వివేక్ సియామ్ మీడియా సమావేశంలో చెప్పారు. రఘువంశీ హత్యకు మూడుసార్లు ప్రయత్నాలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. నాలుగో ప్రయత్నంలోనే హంతకులు విజయవంతంగా రఘువంశీని అంతమొందించారు. అంతేకాకుండా మే 11న రఘువంశీ, సోనమ్‌ల వివాహం జరగడానికి ముందే ఈ హత్యలకు పథకాన్ని రచించారని ఎస్పీ వెల్లడించారు.
మరో మహిళను చంపి, దహనం చేసే స్కెచ్
పోలీసుల విచారణంలో హంతకులు రఘువంశీ హత్యకు అనేక రకాల ప్రణాళికలు రచించినట్టు బయటపడింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహానే అని, అతను సోనమ్‌తో కలిసి కుట్రకు సహకరించినట్టు పోలీసులు ధృవీకరించారు. రఘువంశీని హత్య చేసిన తర్వాత సోనమ్ అదృశ్యమైనట్టు నమ్మించాలని భావించారు. దానికోసం సోనమ్ నదిలో కొట్టుకుపోయిందనే కథనాన్ని సిద్ధం చేసుకున్నారు. అది కాకుండా మరో మహిళను చంపి, సగం శరీరాన్ని దహనం చేసి, ఆ బాడీని సోనమ్ మృతదేహంగా చూపించాలని హంతకులు అనుకున్నారు.
సెల్ఫీ పేరుతో లోయలోకి నెట్టేసే కుట్ర
మరొక ప్లాన్‌లో గౌహతిలో రఘువంశీని చంపాలనుకున్నారు. అక్కడ పర్యాటకులు ఎక్కువ ఉన్న కారణంతో అది కుదరలేదు. షిల్లాంగ్‌లోనూ ఓ ప్రయత్నం జరిగింది. ఇవి కాకుండా సెల్ఫీ తీసుకుందామనే నెపంతో తానే భర్తను లోయలోకి నెట్టేస్తానని సోనమ్ తన ప్రియుడు రాజ్‌కు చెప్పినట్టు విచారణలో బయటపడింది. ఇవన్నీ ఫెయిల్ కావడంతోనే మే 23న హనీమూన్ కోసం మేఘాలయకు తీసుకెళ్లి, అక్కడే సుపారీ ఇచ్చిన ముగ్గురితో కలిసి ఆమె కళ్లెదుటే రఘువంశీని దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత సోనమ్ బురఖా వేసుకుని బస్సులు, ట్యాక్సీల్లో తిరిగి మధ్యప్రదేశ్‌కు పారిపోయింది.
కిడ్నాప్ కథ
భర్తను తానే హత్య చేయించినట్టు బయటపడకూడదని తనను కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడాలని సోనమ్ ప్లాన్ వేసింది. హంతకుల నుంచి తప్పించుకున్నట్టు కథనం అల్లింది. అయితే, రఘువంశీ మృతదేహానికి దగ్గరగా అతన్ని చంపేందుకు వాడిన ఆయుధం, అద్దెకు తీసుకున్న బైకు, సోనమ్ రెయిన్‌కోట్ పోలీసులకు లభించాయి. వాటి ఆధారంగానే పోలీసులు దర్యాప్తులో సోనమ్, ఆమెతో పాటు ప్రియుడు రాజ్ కుట్ర బయటపడింది.






