- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా రాజ్ కుమార్ గోయల్ ప్రమాణం.. హాజరైన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి
మాజీ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్ (Raj Kumar Goyal) భారత కేంద్ర సమాచార కమిషన్ (CIC) ప్రధాన సమాచార కమిషనర్‌గా (చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్) ప్రమాణ స్వీకారం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్ (Raj Kumar Goyal) భారత కేంద్ర సమాచార కమిషన్ (CIC) ప్రధాన సమాచార కమిషనర్‌గా (Chief Information Commissioner) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో నిరాడబరంగా జరిగింది. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, తదితరులు హాజరయ్యారు.
కాగా, 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వంలో న్యాయ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. గతంలో హోంశాఖలో బోర్డర్ మేనేజ్‌మెంట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఈ నియామకంతో సుమారు 9 ఏళ్ల తర్వాత కేంద్ర సమాచార కమిషన్ పూర్తి స్థాయి సామర్థ్యంతో పని చేయనుంది. గత సెప్టెంబర్‌లో హీరాలాల్ సమరియా (Hiralal Samaria) పదవీ కాలం ముగియడంతో సీఐసీ పోస్టు ఖాళీ అయింది. అదనంగా 8 మంది కొత్త సమాచార కమిషనర్లు కూడా నియమితులయ్యారు. వారంతా అతి త్వరాలోనే కొత్త సీఐసీ ముందు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నియామకాలు సమాచార హక్కు చట్టం అమలులో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడానికి దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.






