కాలిఫోర్నియా రాష్ట్రంలో వర్ష బీభత్సం.. ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-27 02:14:53  IST  )

కాలిఫోర్నియా రాష్ట్రంలో వర్ష బీభత్సం.. ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాలిఫోర్నియా (California) రాష్ట్రంలో ఇవాళ తీవ్రమైన అట్మాస్ఫిరిక్ రివర్ (Atmospheric River) తుఫాను వల్ల భారీ వర్షాలు కురిసి, వరదలు, మడ్‌స్లైడ్స్, డెబ్రిస్ ఫ్లోలు ఏర్పడ్డాయి. ఈ తుఫాను క్రిస్మస్ సెలవుల సమయంలో దక్షిణ కాలిఫోర్నియాలో ప్రధానంగా ప్రభావం చూపింది. ముఖ్యంగా సాన్ బెర్నార్డినో కౌంటీలోని రైట్‌వుడ్ వంటి హిల్ రిసార్ట్ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్, మడ్ ఫ్లోలు ఏర్పడి రోడ్లు మూసుకుపోయాయి. ఇక్కడ డజన్ల కొద్దీ రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. పలు వాహనాలు మట్టిలో పూర్తిగా కూరుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన రెస్క్యూ టీమ్ హెలికాప్టర్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇక శాన్ డియాగో సిటీ హైట్స్‌లో బలమైన గాలులతో పాటు భారీ చెట్టు కూలి 60 ఏళ్ల వ్యక్తిపై పడి మృతి చెందాడు. అదేవిధంగా సాక్రమెంటో కౌంటీ షెరిఫ్ ఆఫీసర్ జేమ్స్ కారవాలో రోడ్డుపై కారును నియంత్రించలేక రోడ్డు పక్కనే ఉన్న పవర్ పోల్‌కు ఢీకొట్టి మృతి చెందాడు. అట్మాస్ఫిరిక్ రివర్ తుఫాను కారణంగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ (Gavin Newsom) లాస్ ఏంజిల్స్, ఆరెంజ్, రివర్‌సైడ్, శాన్ బెర్నార్డినో, శాన్ డియాగో, శాస్తా కౌంటీల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు.

Next Story