రైనా, ధావన్‌లకు షాక్.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఆస్తులు అటాచ్‌

by Muthe.Rajitha |   (  Updated:2025-11-06 10:58:38  IST  )

టీం ఇండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు భారీ షాక్ ఇచ్చింది ఈడీ.

రైనా, ధావన్‌లకు షాక్.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఆస్తులు అటాచ్‌
X

దిశ, వెబ్ డెస్క్ : టీం ఇండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు భారీ షాక్ ఇచ్చింది ఈడీ. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించిన కేసులో రైనా, ధావన్‌ల ఆస్తులను అటాచ్ చేసింది. బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురు క్రికెటర్స్ పై మనీ లాండరింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో రైనా, ధావన్‌లకు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

కాగా ఇదే కేసులో ఇదివరకే మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ను కూడా ఈడీ గతంలోనే విచారించగా.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని సర్వత్రా చర్చ నడుస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఎవ్వరినీ వదలబోమని ఇప్పటికే అధికారులు ప్రకటించగా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Next Story