- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi : రాహుల్ పౌరసత్వం కేసు.. న్యాయస్థానం కీలక ఆదేశాలు
by Muthe.Rajitha |
రాహుల్ గాంధీ పౌరసత్వం కేసు(Rahul Gandhi Citizenship Case)లో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : రాహుల్ గాంధీ పౌరసత్వం కేసు(Rahul Gandhi Citizenship Case)లో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ ద్వంద పౌరసత్వంపై కేంద్ర హోంశాఖకు అలహాబాద్ హైకోర్ట్(Alahabad High Court) ముఖ్య ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల్లో రాహుల్ పౌరసత్వంపై తమకు తుది నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు విడుదల చేసింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది ధర్మాసనం. కాగా రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందని.. అందువల్ల భారత పౌరసత్వం చెల్లుబాటు కాదని.. అలాంటపుడు భారత ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఆయనకు లేదని పిటిషనర్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తక్షణమే రాహుల్ భారత పౌరసత్వాన్ని, ఎంపీగా ఎన్నిక చెల్లదంటూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు.
Next Story






