Rahul: రాహుల్ గాంధీ ఓ కామెడీ కింగ్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

by B.Srinivas |   (  Updated:2024-12-09 16:42:32  IST  )

లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Rahul: రాహుల్ గాంధీ ఓ కామెడీ కింగ్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్‌ను కామెడీ కింగ్‌గా అభివర్ణించారు. ఆయన నిరంతరం అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘రాహుల్ ఉత్తమమైన స్టాండ్ ఆఫ్ కామెడీలో మునిగిపోయారు. ఆయన చేసిన దురుద్దేశపూరిత ఆరోపణలు, క్రూరమైన ప్రకటనలు ప్రతిసారీ తప్పుగా నిరూపించబడ్డాయి. మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అతని ప్రచారం ప్రజలను ప్రభావితం చేయడంలో విఫలమైంది. తన వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించబోరు. 2014 తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం’ అని తెలిపారు.

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సైతం రాహుల్ పై విమర్శలు గుప్పించారు. డ్రామా చేసి ప్రజాధనాన్ని వృధా చేసే బదులు ఆయనను ప్రజలు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కాగా, ప్రధాని మోడీ, పారిశ్రామిక వేత్త గౌతం అదానీ మాస్కులు ధరించి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ పై వ్యాఖ్యలు చేశారు.

Next Story