- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్లమెంట్ సమావేశాల వేళ ఫేక్ వీడియోలు.. రూ.22 పెట్టుబడితో 20 లక్షల లాభాలంటూ బురిడీ
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీడియోలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో అనేక మంది ఆన్ లైన్ ట్రేడింగ్ (Online Trading Scam) వైపు ఆకర్షితులు అవుతున్నారు. ముఖ్యంగా ఈజీ మనీ కోసం రకరకాల ఫ్లాట్ ఫామ్ లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని ఆసరగా చేసుకున్నంటున్న కేటుగాళ్లు అమాయకులే టార్గెట్‍గా రెచ్చిపోతున్నారు. ఫేక్ వాయిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉయోగించి సమాజంలోని పలుకుబడి కలిగిన వారి వీడియోలుగా ఎడిట్ చేస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman Fake Video), ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీడియోలతో ఫేక్ వీడియోలు వైరల్ గా మారాయి. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ మరోవైపు జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్న నేతలకు సంబంధించిన ఫేక్ వీడియోలో వైరల్ అవుతుండటం సంచలనంగా మారింది.
రూ. 22 వేలతో రూ. 20 లక్షలంటూ గాలం:
పార్లమెంట్‍లో రాహుల్ గాంధీ (Rahul Gandhi Fake Video), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Fake Video) కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను నిలదీస్తున్నట్లుగా వీడియోలను రూపొందించారు. రూ. 22 ఇన్వెస్ట్ చేస్తే రూ.2 మిలియన్లు మీకు సీక్రెట్ గా వస్తున్నాయి. ఈ విషయాన్ని దేశప్రజలకు బహిరంగ పరచాలని లేదా మీరు రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిర్మలా సీతారామన్ ను ప్రశ్నస్తే ఇందుకు నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ఇది కేంద్ర ప్రభుత్వ అధికారిక మొబైల్ యాప్ అని ఇందులో ఎలాంటి సీక్రెట్ లేదంటూ చెబుతున్నట్లుగా వీడియోను క్రియేట్ చేశారు. ప్రజలకు నమ్మకం కలిగే విధంగా గతంలో వీరు పార్లమెంట్‍లో మాట్లాడిన వీడియోలకు ఫేక్ ఆడియోలను జోడించి వైరల్ చేస్తున్నారు. వీడియో ప్రారంభంలోనే ఇవాళ 28 జనవరి 2026 అని ఇప్పటికేనా మీ రహస్యాన్ని బయటపెట్టాలంటూ రాహుల్ గాంధీ నిలదీస్తుంటే ఈ యాప్ టెస్టింగ్ పూర్తయిందని ఇక ప్రజలు తమ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకుని రూ. 22 వేలు డిపాజిట్ చేస్తే ప్రతి నెల రూ.20 లక్షలు మీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని నిర్మలాసీతారామన్ చెబుతున్నట్లుగా ఉంది. అయితే గతంలో ఇదే తరహా వీడియోలను రాజ్యసభ సభ్యురాలు ఇన్ఫోసిస్ సుధామూర్తితో పాటు పలువు ముఖాలతోనూ రూపొందించారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.






