Rahul: మోడీ ఓటు చోరీకి పాల్పడ్డారు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

by B.Srinivas |

2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాని మోడీ ఓటు చోరీకి పాల్పడ్డాడని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.

Rahul: మోడీ ఓటు చోరీకి పాల్పడ్డారు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాని మోడీ ఓటు చోరీకి పాల్పడ్డాడని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul gandhi) ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను క్రమపద్దతిలో తారుమారు చేసినట్టు కాంగ్రెస్ వద్ద ప్రూఫ్ ఉందని తెలిపారు. మొత్తం వాస్తవాలను వెలికి తీసే హైడ్రోజన్ బాంబు ఉందని దానిని త్వరలోనే బయపపెడతామని నొక్కి చెప్పారు. కేరళలోని వయనాడ్‌ (Wayanad) లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పరిస్థితి వాస్తవికతను పూర్తిగా నాశనం చేయబోయే హైడ్రోజన్ బాంబును మేము బహిర్గతం చేయబోతున్నా్ం. మా దగ్గర 100 శాతం రుజువు ఉంది. త్వరలోనే దానిని వెల్లడించి దేశానికి పూర్తి సత్యాన్ని తెలియజేస్తాం. రుజువు లేకుండా ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ హైడ్రోజన్ బాంబు ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గానికి సంబంధించినదా అని ప్రశ్నించగా రాహుల్ స్పందిస్తూ.. మీడియా పని ఊహాగానాలు చేయడం, నా పని దేశం ముందు సత్యాన్ని ఉంచడం అని అన్నారు.

ఓటర్లను ఒక పద్ధతి ప్రకారం మోసపూరితంగా చేర్చడం, తొలగించడం జరిగిందని ఆరోపించిన తన చివరి రెండు విలేకరుల సమావేశాలను ప్రస్తావిస్తూ.. ‘కర్ణాటకలోని మహాదేవ్ పుర, అలంద్‌ సెగ్మెంట్లలో జరిగిన మోసాన్ని బయటపెట్టాం. మోడీ ఓటు చోరి చేసి ఎన్నికల్లో గెలిచారని దేశంలో ఎవరికీ సందేహం లేకుండా ఆధారాలు వెల్లడిస్తాం’ అని చెప్పారు. అనంతరం వయనాడ్‌లోని కన్నతర గ్రామంలో ఊమెన్ చాందీ స్మారక ఆడిటోరియం ప్రారంభోత్సవంలో రాహుల్ పాల్గొన్నారు. కాగా, గత కొన్ని రోజుల నుంచి ఎన్నికల్లో ఓటు చోరీ జరుగుతుందని రాహుల్ పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

Next Story