Rahul: ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబ్ వంటి ఆధారాలు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

by B.Srinivas |   (  Updated:2025-09-01 15:58:41  IST  )

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డాడు.

Rahul: ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబ్ వంటి ఆధారాలు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విరుచుకుపడ్డాడు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించి త్వరలోనే హైడ్రోజన్ బాంబు లాంటి ఆధారాలను వెల్లడిస్తామని తెలిపారు. ఆ తర్వాత ప్రధాని మోడీ ముఖం చాటేస్తారని చెప్పారు. ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘అణుబాంబు కంటే పెద్దది హైడ్రోజన్ బాంబు. అతి త్వరలో ఓటు చోరీ గురించి హైడ్రోజన్ బాంబు బయటపడబోతున్నది. బీజేపీ నాయకులు సిద్ధంగా ఉండండి’ అని వ్యాఖ్యానించారు. హైడ్రోజన్ బాంబు పేలిన తర్వాత, నరేంద్ర మోడీ దేశానికి తన ముఖాన్ని చూపించలేరని ఆరోపించారు. ఓటు చోర్, గడ్డి చోడ్ అనే నినాదాన్ని లేవనెత్తగా దానిని ప్రజలు దానిని స్వీకరించారు. ఇప్పుడు అది చైనాలోనూ ప్రతిధ్వనిస్తోందని చెప్పారు.

రాహుల్ ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. రాహుల్ ప్రకటన బాధ్యతా రాహిత్యంగా ఉందని ఫైర్ అయ్యారు. ఆయన మాటలను అర్థం చేసుకోవడానికి టైం పడుతుందని, ఎన్నికలకు అణు బాంబు, హైడ్రోజన్ బాంబులకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. తన ఆరోపణలు నిజమైతే ఎన్నికల కమిషన్ కోరిన అఫిడవిట్‌ను ఎందుకు సమర్పించలేదని నిలదీశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, ఆయన ప్రవర్తన సరిగా లేదని విమర్శించారు.

Next Story