- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi: రాహుల్ గాంధీ "ఓటర్ అధికార్ యాత్ర" రేపే.. 1300 కిలోమీటర్ల రూట్‌మ్యాప్ విడుదల
కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రేపటి నుంచి "ఓటర్ అధికార్ యాత్ర" చేయనున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) రేపటి నుంచి "ఓటర్ అధికార్ యాత్ర" (Voter Adhikar Yatra) చేయనున్నారు. రేపు బీహార్‌లోని ససారాంలో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. 16 రోజుల్లో 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్లు యాత్ర రూట్ మ్యాప్‌ను ఇవాళ విడుదల చేశారు. ఇందులో భాగంగా ర్యాలీలు, సభలు, కార్యక్రమాలతో ప్రజల మధ్యకు రాహుల్ రానున్నారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ఓటర్ అధికార్ యాత్ర ముగియనుంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav)తో సహా యాత్రలో ఇండియా కూటమి నేతలు, కీలక వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. త్వరలో బీహార్‌లో జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు యాత్రను చేపట్టారు. దేశవ్యాప్తంగా పారదర్శక ఓటర్ల జాబితా లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలిపారు. కాగా, గత కొద్ది రోజులుగా దేశంలో అనేక రాష్ట్రాల్లో (Vote Chori) ఓట్ల దొంగతనం జరిగిందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.






