- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో జెన్-Z ఉద్యమం.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్
సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ పెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ పెట్టారు. త్వరలో భారత్‌లో కూడా జెన్-Z ఉద్యమం(Gen Z Protest) వస్తుందని జోస్యం చెప్పారు. ఓట్ చోరీ(Vote Chori)పై యువత, విద్యార్థులు తిరుగుబాటు చేయడం ఖాయమని అన్నారు. యువతతో కలిసి తాను కూడా రోడ్డెక్కుతానని ప్రకటించారు. రాజ్యాంగాన్ని కాపాడటమే ఇప్పుడు అందరి ముందున్న తక్షణ కర్తవ్యం అన్నారు.
కాగా, అంతకుముందు ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓట్ చోరీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని విమర్శించారు. రాష్ట్రం వెలుపలి నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించినట్లు తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. కర్ణాటకలోని అలంద్‌లో ఆరువేల ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని విమర్శించారు.






