ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Maharashtra Election Results)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Maharashtra Election Results)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం పార్లమెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఓటర్ల జాబితాను తారుమారు చేశారని ఆరోపించారు. ఐదు నెలల్లో కొత్తగా 70 లక్షల ఓటర్లను చేర్చారని అన్నారు. షిరిడీలో ఒకే భవన్‌లో 7000 మంది ఓటర్లను చూపించారని తెలిపారు. లోక్‌సభ(Lok Sabha) ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భారీ సంఖ్యలో పెరిగాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఓటర్ల డేటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు మోడీ(PM Modi) ప్రభుత్వం సరైన పరిష్కారం చూపించలేకపోతోందని విమర్శించారు. ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం విఫలమై దానిని చైనాకు అప్పగించామన్నారు. ఇకనైనా మనం ఉత్పత్తి పైనే పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

‘మేకిన్‌ ఇండియా’ మంచి ఆలోచనే అయినప్పటికీ దానిని అమలుచేయడంలో ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) విఫలమవుతోందని అన్నారు. తెలంగాణలో కులగణన పూర్తి చేసినట్లు చెప్పారు. దేశంలో 90 శాతం జనాభా ఉన్న బీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు హక్కులు దక్కడం లేదని ఆవేదన చెందారు. తెలంగాణలో నిర్వహించిన సర్వేలో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నట్టు తేలిందన్నారు. బీజేపీలో కూడా 50 శాతం మంది ఎంపీలు బీసీ వర్గానికి చెందిన వాళ్లేనని, కానీ వాళ్లకు మాట్లాడే అధికారం లేదంటూ సెటైర్ వేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టినప్పుడే ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. దీని కోసం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో కొత్త విషయాలు లేవని అన్నారు.

Next Story