- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్‌లో రాహుల్ గాంధీ భారీ ర్యాలీ
భారత పార్లమెంట్ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఈ రోజు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే త్వరలో ఎన్నికలు ఉన్న ఈ రాష్ట్రంలో రాహుల్ ర్యాలీ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత పార్లమెంట్ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ రోజు భారీ ర్యాలీ (huge rallyలో పాల్గొన్నారు. అయితే త్వరలో ఎన్నికలు ఉన్న ఈ రాష్ట్రంలో రాహుల్ ర్యాలీ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. గత కొద్ది రోజులుగా బీహార్ (Bihar) నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పేపర్ లీకేజ్ ఘటనలను నిరసిస్తూ.. బీహార్‌లోని బెగుసరాయ్‌లో "పలాయన్ రోకో, నౌకరీ దో యాత్రా" (#पलायन_रोको_नौकरी_दो_यात्रा)లో భాగంగా ఈ భారీ ర్యాలీని ఎన్ఎస్ యూఐతో పాటు ఇతర విద్యార్థి సంఘాలు (Student Unions) నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ బీహార్ యువతకు న్యాయం, ఉపాధి అవకాశాల కోసం జరుగుతున్న పోరాటం. ఈ కార్యక్రమం ద్వారా బీహార్ యువత యొక్క సమస్యలను, వారి సంఘర్షణను ప్రపంచానికి చూపించడం లక్ష్యంగా పెట్టుకొని రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి "సైద్ధాంతిక ఓటమిని కలిగించాలని" పార్టీ కార్యకర్తలను కోరిన జనవరి తర్వాత రాహుల్ గాంధీ బీహార్‌లో చేస్తున్న మూడవ పర్యటన ఇది. అయితే ఈ ర్యాలీలో రాహుల్ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలతో పాటు, నిరుద్యోగులు పాల్గోనగా వారితో పాటు రాహుల్ గాంధీ పాదయాత్రగా ముందుకు సాగుతున్నారు.






