- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తప్పించుకోకుండా నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.. ఈసీకి రాహుల్ గాంధీ కౌంటర్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Elections)పై రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం(Election Commission) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Elections)పై రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం(Election Commission) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోసారి నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈసీ అధికారుల మనో ధైరాన్ని దెబ్బతీసే రీతిలో రాహుల్ మాట్లాడారని.. ఇది సరైన పద్ధతి కాదని ఈసీ వివరణ ఇచ్చింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలు ఈసీ వెబ్‌సైట్‌లో ఉన్నట్టు వెల్లడించింది. ఆరోపణలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినప్పటికి మళ్లీ అవే ఆరోపణలు చేయడం తగదని ఈసీ వ్యాఖ్యానించింది. తాజాగా ఈసీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ. లేఖలను బహిర్గతం చేయడం సరైంది కాదు. తప్పించుకోకుండా నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మహారాష్ట్రతో సహా అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటరు జాబితాలను ప్రచురించాలి. మహారాష్ట్ర పోలింగ్ బూత్‌ల సీసీఫుటేజ్ విడుదల చేయాలి. నిజం చెబితే ఈసీపై విశ్వసనీయత పెరుగుతుంది అని రాహుల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.






