- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rahul Gandhi: దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది.. లోక్‌సభలో రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్
దేశంలో నిరుద్యోగం తాండవం చేస్తోందని విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో నిరుద్యోగం తాండవం చేస్తోందని విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఇవాళ ఆయన లోక్‌సభలో రాష్ట్రపత్రి ప్రసంగంపై ఆయన మాట్లాడుతూ.. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని అన్నారు. రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ప్రసంగంలో కొత్త విషయాలు ఏవి లేవని ఆక్షేపించారు. నేటికి దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని కామెంట్ చేశారు. మేకిన్ ఇండియా (Make In India) వల్ల ఎలాంటి మార్పు జరగలేదని.. ఎక్కడ వేసిన గొంగడి అక్కే ఉందని ఎద్దేవా చేశారు.
అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) కూడా ఆ దిశగా కృషి చేయలేదని తాను చెప్పడం లేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) హయాంలో తయారీ రంగా పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా (Make In India) ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. భారతదేశం మొత్తం చైనా దిగుమతులపై ఆధారపడుతోందని ఫైర్ అయ్యారు. మేకిన్ ఇండియాతో పెద్దగా ఒరిగింది ఏమీ లేదని అన్నారు. చాలా సంస్థలు ఉత్పత్తులను పెంచడానికి ప్రయత్నించాయని, కానీ తయారీ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేక పోయామని ధ్వజమెత్తారు. అదేవిధంగా సామాజిక అశాంతి కూడా పెరిగిందని.. దీనిపై మోడీ సర్కార్ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
కుంభమేళా తొక్కిసలాట ఘటనపై చర్చకు విపక్షాల పట్టు
అంతకు ముందు సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఉత్తర్‌ప్రదేశ్ (Uttar PradesH) రాష్ట్రంలో మహా కుంభమేళా (Maha Kumbhmela)లో జరిగిన తొక్కిసలాటపై చర్చకు పట్టుబట్టారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) రాజీనామా చేయాలని విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. అదేవిధంగా తొక్కిసలాటలో చనిపోయిన వారి పేర్లను బయట పెట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో విపక్ష సభ్యులపై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు.






