విమాన ప్రమాదంపై రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపు

by Gantepaka Srikanth |

గుజరాత్‌(Gujarat)లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ప్రమాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దిగ్భ్రాంతికి గురయ్యారు.

విమాన ప్రమాదంపై రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌(Gujarat)లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ప్రమాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విమాన ప్రమాదంవ హృదయ విదారకరం. బాధితులు అనుభవిస్తున్న బాధను ఎవరం ఊహించలేం. సహాయక చర్యల్లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా, గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా ఫ్లయిట్‌ నెంబర్‌ ఏఐ-171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్‌వే నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. మేఘాని నగర్‌ ఘోడాసర్‌ క్యాంప్‌ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దాదాపు 100 మందికి పైగా ప్రయాణికులు మృతిచెంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

Next Story