- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల బాండ్ల స్కీం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్ : రాహుల్
by Hajipasha |
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల స్కీం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

X
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల స్కీం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ పథకం ద్వారా సేకరించిన నిధులను రాజకీయ పార్టీలను చీల్చడానికి, ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ వాడిందని ఆయన తెలిపారు. ఎన్నికల బాండ్ల వివరాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శుక్రవారం మహారాష్ట్రలోని థానేలో రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల విరాళాలకు, రాష్ట్రాలలో కాంగ్రెస్ లేదా ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు ఇచ్చిన కాంట్రాక్టులకు మధ్య ఎలాంటి లింక్ లేదని స్పష్టం చేశారు. కాగా, రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర చివరి దశలో భాగంగా ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది.
Next Story






