పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ అసలు రంగు బయట పడింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Malleboina Mahesh |   (  Updated:2024-07-01 12:40:27  IST  )

పార్లమెంట్ లో హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ అసలు రంగు బయట పడింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్‌లో హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా స్పించిన ఆయన.. తన ట్వీట్‌లో "స్వయం ప్రకటిత రాజ్యాంగ రక్షకుడు, ఎన్నికల హిందువు అయిన రాహుల్ గాంధీ తన అసలు రంగును బయటపెట్టుకున్నాడు. హిందువులను హింసాత్మక సమాజంగా పేర్కొంటూ ఆయన చేసిన ప్రకటన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ఎజెండాను బట్టబయలు చేసింది. కాంగ్రెస్ హిందువులను అవమానించడం మొదటిసారి కాదు. ఇంతకుముందు సనాతన ధర్మాన్ని అవమానించారు. ఇప్పుడు, హిందువులపై పార్లమెంట్ సాక్షిగా ప్రత్యక్ష దాడి చేశారు. ఇది చాలా అవమానకరమైనది. రాహుల్ గాంధీ ప్రకటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అతను మొత్తం హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story