Rahul Gandhi: బీజేపీకో న్యాయం మాకో న్యాయమా? ఈసీపై రాహుల్ మరోసారి ఫైర్

by Prasad Jukanti |

బిహార్ లో ఓటు అధికార్ యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ ఈసీపై ఘాటు విమర్శలు చేశారు.

Rahul Gandhi: బీజేపీకో న్యాయం మాకో న్యాయమా? ఈసీపై రాహుల్ మరోసారి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ చెప్పుచేతల్లో ఈసీ నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ధ్వజమెత్తారు. ఈసీ ఓట్ల చోరీచేస్తోందని ఆరోపించారు. నేను ప్రెస్ మీట్ పెడితే అడివిట్ అడుగుతున్న ఈసీ.. బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెడితే మాత్రం అఫిడవిట్ కోరడం లేదని విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం ఓటర్ జాబితాలో చేపట్టిన ఎస్ఐఆర్, ఓటు చోరీకి వ్యతిరేకంగా ఇవాళ బిహార్ లోని సాస్రామ్ లో ఓట్ అధికార్ యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ ఈ సందర్భంగా మాట్లాడారు. బిహార్ లో (Bihar) చేస్తున్న ఎస్ఐఆర్ అసలురంగును బయటపెడతామన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఓటు చోరీ జరుగుతోందని దీన్ని అడ్డుకుని తీరుతామన్నారు.

కర్ణాటకలోని మహదేవ్ పూరలో లక్ష ఓట్లు చోరీకి గురయ్యాయి. మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లను సృష్టించారు. బిహార్ లోనూ ఓటు చోరీకి పాల్పడి అక్రమంగా గెలవాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈసీని వీడియో క్లిప్పింగ్ లు అడిగినా ఇవ్వడం లేదని ఆరోపించారు. పేదల దగ్గరున్న బలం ఓటు ఒక్కటేనని మీ ఓట్లను దొంగిలించి, ఎన్నికల్లో గెలిచి దేశ సంపదను సంపన్నులకు అందిస్తారన్ని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసమే తాము ఈ పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. కులగణనపై మోడీ చేసిన ప్రకటనలో నిబద్ధత లేదనీ కులగణన చేయాలని మేం పార్లమెంట్ లో పట్టుబట్టాం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని బద్ధలు కొడాతమన్నారు.

Next Story