- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi : కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ.. కాసేపు చెప్పులు కుట్టే వ్యక్తితో ముచ్చట్లు
లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో పర్యటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో పర్యటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2018 లో రాహుల్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ విచారణనకు శుక్రవారం ఉదయం సుల్తాన్ పూర్ కోర్టులో స్వయంగా విచారణకు రాహుల్ గాంధీ హజరయ్యారు. ఇప్పటికే ఇదే కేసులో రాహుల్‌కు కోర్టు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. రాహుల్‌ను వేధించేందుకే బీజేపీ అక్రమ కేసులు పెట్టిందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
కాగా, సుల్తాన్‌పూర్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ.. ఓ వీధిలో చెప్పులు కుట్టే కొట్టు దగ్గర ఆగారు. ఆ కొట్టు ముందు కూర్చుని అక్కడ చెప్పులు కుడుతున్న వ్యక్తితో కాసేపు ముచ్చటించారు. అతని సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అతనికి తన వంతుగా ఆర్థిక సాయం చేస్తానని భరోసా ఇచ్చారు.






