ఖర్గేకు మసాజ్‌ చేసిన రాహుల్‌ గాంధీ.. పార్లమెంట్‌లో ఆసక్తికర సన్నివేశం వైరల్‌

by Ramesh Naini |

పార్లమెంట్‌ సమావేశాల్లో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

ఖర్గేకు మసాజ్‌ చేసిన రాహుల్‌ గాంధీ.. పార్లమెంట్‌లో ఆసక్తికర సన్నివేశం వైరల్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్‌ సమావేశాల్లో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భుజం నొప్పితో బాధపడుతున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్‌ గాంధీ కొంతసేపు మసాజ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో కన్పిస్తున్న ప్రకారం.. రాహుల్‌ గాంధీ మల్లికార్జున ఖర్గే వద్దకు వచ్చి కొంతసేపు ఆయన భుజంపై చేతులుతో మసాజ్‌ చేశారు. రాహుల్‌ సోదరి, ఎంపీ ప్రియాంక గాంధీ కూడా ఆ పక్కనే ఉన్నారు. నొప్పి ఉన్నప్పుడు ఇలా చేయాలంటూ ప్రియాంక.. ఖర్గేకు చెబుతున్నట్లుగా వీడియోలో కన్పిస్తోంది. పార్లమెంట్ లో ఇవాళ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలోనే రాహుల్, పార్టీ చీఫ్ ఖర్గే మధ్య జరిగిన హృదయపూర్వక సన్నివేశం కెమెరాకు చిక్కింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్‌లు ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ గాంధీ గ్రేట్ పర్సన్ అని పలువురు నెటిజన్‌లు కొనియడారు. వీడియో ఇదే..

Next Story