- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi : రాహుల్ గాంధీకి స్వల్ప అనారోగ్యం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్వల్ప అనారోగ్యం పాలయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్వల్ప అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. గురువారం ముస్తఫాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ నిర్వహించాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా వైద్యుల సూచన మేరకు ఈ ప్రచార సభ రద్దైందని ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్(PCC Cheif Devendar Yadav) తెలిపారు. అయితే శుక్రవారం మాదిపూర్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని చెప్పారు. భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించే అవకాశం ఉందని అన్నారు. కాగా, సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్ సమీపంలో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరుకాలేదు. ఆయన పాల్గోవాల్సిన మూడు ప్రచార సభల్లో రెండు రద్దయ్యాయి. దీంతో ముస్లిం ఓటర్ల విభజనకు కారణం కాకుండా రాహుల్ గాంధీ ఆప్‌కు సహకరిస్తున్నట్లు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.






