రాహుల్ గాంధీ గొప్ప మనసు.. అనాథలైన ఆ 22 మంది పిల్లల దత్తత తీసుకోవాలని నిర్ణయం

by Yella Dhawani Reddy |

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన గొప్ప మనసును చాటుకున్నారు.

రాహుల్ గాంధీ గొప్ప మనసు.. అనాథలైన ఆ 22 మంది పిల్లల దత్తత తీసుకోవాలని నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో అనాథలైన 22 మంది పిల్లలను దత్తత తీసుకోనున్నారు. ఈ విషయాన్ని జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా వెల్లడించారు. భారత్-పాకిస్థాన్ ఉద్రికత్తల్లో పూంఛ్ జిల్లాలో తల్లిదండ్రులను కోల్పొయిన 22 మంద్రి పిల్లలను దత్తత తీసుకోనున్నట్లు తెలిపారు. ఆ పిల్లల గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసే వరకు వారి విద్య, ఖర్చులు, తదితర అవసరాలను రాహుల్‌ గాంధీ చూసుకోనున్నట్లు చెప్పారు. ఇందుకోసం బుధవారం (జులై 30) మొదటి విడత సాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

కాగా, ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ షెల్లింగ్‌లో సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రత్యేకించి జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో పాకిస్థాన్ జరిపిన మారణహోమం కారణంగా పలు కుటుంబాలు తల్లిదండ్రులను కోల్పోయాయి. అనేక మంది చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. అయితే, మే నెలలో పూంచ్ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ స్థానిక పార్టీ నాయకులను బాధిత పిల్లల జాబితాను రూపొందించమని కోరారు. తదనంతరం, ఒక సర్వే నిర్వహించి 22 మంది పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Next Story