- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరిన రాహుల్ గాంధీ, ఖర్గె
భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడం, అందరూ కలిసి దేశ సంకల్పాన్ని చూపడం అవసరమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవలి పరిణామాల మధ్య జాతీయ భద్రతపై చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాలను వెంటనే నిర్వహించాలని ప్రతిపక్ష, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ లేఖలో.. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ, అమెరికా పాత్ర గురించి ప్రస్తావించారు. 'పెహల్గాం ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ గురించి ప్రజలు, పార్టీలు చర్చించడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడం, అందరూ కలిసి దేశ సంకల్పాన్ని చూపడం అవసరమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇదే సమయంలో కాల్పుల విరమణను మొదట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడాన్ని తప్పుబట్టారు. మన దేశ కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చడాన్ని వ్యతిరేకించారు. ఇదే అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె ప్రధాని మోడీకి లేఖ రాస్తూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి వివరాలు తెలియజేసేందుకు ప్రత్యేక సమావేశాలు అవసరమని చెప్పారు.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
సాధారణ సమావేశాలు కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగడం సహజం. చివరిసారిగా ఇలాంటి సమావేశం 2023, సెప్టెంబర్‌లో జరిగింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో పాత భవనం నుంచి కొత్త పార్లమెంటు భవనానికి మారిన సందర్భంలో జరిగింది. అనేక అంశాల గురించి చర్చించారు, కీలక మైలురాయి వంటి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదించారు.






