గాడ్సే వంశంతో ప్రాణ హాని.. సావర్కర్‌పై అనుచితన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీ

by Phanindra |   (  Updated:2025-08-13 16:36:32  IST  )

సావర్కర్‌పై అనుచితన వ్యాఖ్యల కేసులో తనకు ప్రాణ హాని ఉందని, ఫిర్యాదు దారు గాడ్సే వారసుడని రాహుల్ గాంధీ పిటిషన్.

గాడ్సే వంశంతో ప్రాణ హాని.. సావర్కర్‌పై అనుచితన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: నాథూరాం గాడ్సే వారసులతో తనకు ప్రాణహాని ఉందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని పూణేలోని ఒక కోర్టులో రాహుల్ గాంధీ వెల్లడించారు. సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి నాథూరాం గాడ్సే వారుసడని రాహుల్ తన అప్లికేషన్‌లో పేర్కొన్నారు. దానికితోడు ఇటీవలి కాలంలో రాజకీయ పరంగా తాను లేవనెత్తిన సమస్యలు, గతంలో సావర్కర్‌పై తాను చేసిన వ్యాఖ్యల వల్ల తనకు తీవ్రమైన ప్రాణహాని ఉందని రాహుల్ చెప్పారు.

తనపై ఫిర్యాదు చేసిన సాత్యకి సావర్కర్ నేరుగా గాడ్సే వారుసులని, వారి వంశంలోనే హింస, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనలకు ఉన్నాయని ఆరోపించారు. ‘హాని చేయడం లేదా వేరే విధాలుగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తారనడానికి స్పష్టమైన భయం ఉంది’ అని రాహుల్ తన పిటిషన్‌లో వెల్లడించారు. మహాత్మా గాంధీ హత్యను గుర్తుచేస్తూ.. ‘ఫిర్యాదుదారు వంశంలో హింస చేసిన చరిత్ర ఉంది. మరోసారి ఆ చరిత్ర పునరావృతం కాకుండా చూడాలి’ అని పేర్కొన్నారు.

కాగా, 2022 నవంబరు 17న భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా వీర్ సావర్కర్‌ను ‘బ్రిటిష్ సర్వెంట్’ అనడంతోపాటు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి సావర్కర్ పెన్షన్ తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై సాత్యకి సావర్కర్ పరువు నష్టం దావా వేశారు.

Next Story