రాహుల్ 10 జన్మలెత్తినా సావర్కర్ కాలేరు: అనురాగ్ ఠాకూర్

by S Gopi |

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర... Rahul Gandhi "Cannot Be Like Savarkar" Even If Reborn: Anurag Thakur

రాహుల్ 10 జన్మలెత్తినా సావర్కర్ కాలేరు: అనురాగ్ ఠాకూర్
X

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ మళ్లీ 10 జన్మలు ఎత్తినా సావర్కర్ లాగా ఉండలేరని దుయ్యబట్టారు. ఆదివారం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జితో అహింత రన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సావర్కర్‌ను అవమానించిన రాహుల్‌ను దేశం ఎప్పుడు క్షమించబోదని అన్నారు. సావర్కర్ తన జీవితం స్వాతంత్ర్య ఉద్యమం కోసం పనిచేస్తే... రాహుల్ మాత్రం బ్రిటిషర్ల సహాయంతో భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. గత నెల 25న రాహుల్ మాట్లాడుతూ 'నా పేరు సావర్కర్ కాదు.. నేను గాంధీని.. గాంధీ ఎప్పుడు ఎవ్వరికీ క్షమాపణ చెప్పరు’ అని అన్నారు. దీనిపై మహారాష్ట్ర నేతలతోపాటు బీజేపీ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్సీపీ నేత శరద్ పవార్ సూచనతో రాహుల్ ఇకపై సావర్కర్ నుద్దేశించి మాట్లాడటం తగ్గిస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Next Story