- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపే విజయ్ ప్రమాణస్వీకారం.. కార్యక్రమానికి రాహుల్ గాంధీ
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5వేల మందికి పాసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5వేల మందికి పాసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రముఖులు, నేతలు హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో విజయ్ పార్టీకి 108 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో విజయ్‌కి ఇతర పార్టీ ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తు కుదిరింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతిస్తున్నారు. కమ్యూనిస్టులు, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్ మద్దతిస్తున్న నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సైతం ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే ఎన్నికలకు ముందు మాత్రం రాహుల్ గాంధీ డీఎంకే పార్టీకి మద్దతిచ్చారు. ఇండియా కూటమిలోనూ డీఎంకే ఉంది. కానీ ఎన్నికల తరవాత టీవీకేకు మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ పై విమర్శలు వస్తున్నాయి. ఇండియా కూటమిలోని పార్టీకే రాహుల్ హ్యాండ్ ఇచ్చారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






