రాహుల్ గాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి : కాంగ్రెస్ సీనియర్ నేత

by Naga Rani Yarlagadda |

తమ దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను వెనిజులా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం లభించిన విషయం తెలిసిందే.

రాహుల్ గాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి : కాంగ్రెస్ సీనియర్ నేత
X

దిశ, వెబ్‌డెస్క్: తమ దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను వెనిజులా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం లభించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ప్రతినిధి, సీనియర్ నేత సురేంద్ర రాజ్ పుత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అందులో రాహుల్ గాంధీ - మరియా కొరినా మచాడో మధ్య ఉన్న సారూప్యతలను వివరించారు. రాజ్యాంగాన్ని రక్షించినందుకు వెనిజులా ప్రతిపక్ష నేతకు నోబెల్ శాంతి బహుమతి లభించడం సంతోషంగా ఉందన్న ఆయన.. భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా దేశ రాజ్యాంగాన్ని కాపాడే పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారన్నారు.

ఓటు చోరి, బీహార్ ఓటర్ల జాబితా నుండి ఉద్దేశపూర్వకంగా ఓటర్ల పేర్లను తొలగించడం, ఎన్నికల్లో బిజెపి మరియు దాని మిత్రదేశాలకు ప్రయోజనం చేకూర్చడానికి EVM హ్యాకింగ్, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను అంతం చేయడానికి చేసిన ప్రయత్నాలు వంటి అంశాలను లేవనెత్తారు. వీటన్నింటిపై రాహుల్ చేస్తున్న పోరాటానికి కూడా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వొచ్చని పరోక్షంగా సురేంద్ర రాజ్ పుత్ తనమనసులో మాట బయటపెట్టారు.

Next Story