మరోసారి మోడీపై రాహుల్ విమర్శలు

by Muthe.Rajitha |

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం బిహార్ ఎన్నికల ప్రచారంలో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మరోసారి మోడీపై రాహుల్ విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం బిహార్ ఎన్నికల ప్రచారంలో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెగుసరాయ్ లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో బిహార్‌కు వచ్చి అనేక ప్రసంగాలు, వాగ్దానాలు చేస్తారని కానీ ఎన్నికల తర్వాత రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడరని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగం గురించి ప్రశ్నలు లేవనెత్తకుండా యువత దృష్టిని మళ్లించడానికి వారిని రీల్స్ చూడమని మోడీ కోరుతున్నారని విమర్శించారు. తమ ఇండియా కూటమి బిహార్‌లో అధికారంలోకి వస్తే విద్య, ఉద్యోగ అవకాశాలు అందిస్తామని అన్నారు.

కేంద్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నలంద వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాన్ని బిహార్‌లో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. భారత్-పాక్ సైనిక ఘర్షణను ఆపానని ట్రంప్ పదేపదే చెబుతున్నప్పటికీ ఆయనను నిలదీసి ప్రశ్నించే ధైర్యం మోడీకి లేదని ఎద్దేవా చేసారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలు వంటి నిర్ణయాలతో దేశంలోని అదానీ, అంబానీలకు మాత్రమే లాభం కలిగిందని ఆరోపించారు. కానీ తాము చిరు వ్యాపారులు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముందుకు వెళ్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Next Story