Rahul: బిహార్ ఎన్నికలకు బీజేపీ కుట్ర.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ

by B.Srinivas |

మహారాష్ట్ర తరహాలోనే ఇప్పుడు బిహార్ ఎన్నికలనూ హైజాక్ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ఆరోపించారు.

Rahul: బిహార్ ఎన్నికలకు బీజేపీ కుట్ర.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర తరహాలోనే ఇప్పుడు బిహార్ ఎన్నికలనూ హైజాక్ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. దీని కోసం ఎన్నికల సంఘం కొత్త కుట్రను ప్రారంభించిందని విమర్శించారు. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ ప్రసంగించారు. ‘లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లు చేరారు. ఈ ఓటర్లు ఎవరో, వారు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు? ఓటర్ల జాబితాలు, పోలింగ్ వీడియోగ్రఫీని అందించాలని ఎన్నికల సంఘాన్ని చాలాసార్లు అడిగాం. కానీ వారు దానికి సమాధానం చెప్పలేదు. బిహార్‌లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది’ అని వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తోందన్నారు. బిహార్‌లో అవతకవకలకు పాల్పడేందుకు ఎన్నికల సంఘాన్ని బీజేపీ ఉపయోగంచుకుంటుందని ఆరోపించారు. ఒడిశా ప్రభుత్వంపైనా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఒడిశా గవర్నమెంట్ పేదల డబ్బును దొంగిలిస్తోందని మండిపడ్డారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కోసం ప్రధాని మోడీ ప్రజల నుంచి, ప్రభుత్వాల నుండి సేకరించిన వేల కోట్ల రూపాయలను మూడు నుంచి నాలుగు పెద్ద కంపెనీలకు ధారాదత్తం చేశారని ఫైర్ అయ్యారు.

Next Story