- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పహల్గాం ఉగ్రదాడిపై క్వాడ్ సంచలన ప్రకటన.. విదేశీ మంత్రులతో జైశంకర్ భేటీ
అమెరికాలో నిర్వహించిన క్వాడ్ విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో కేంద్రమంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ లోని పహల్గామ్ లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి ప్రస్తావన రాగా..

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో నిర్వహించిన క్వాడ్ విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో (Quad Leaders Meeting) కేంద్రమంత్రి జైశంకర్ (Jai Shankar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ లోని పహల్గామ్ లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) ప్రస్తావన రాగా.. దానిని క్వాడ్ ఖండించింది. నేరస్థులు, బాధితులు ఒక్కటి కాదన్న విషయాన్ని క్వాడ్ భాగస్వాములు అర్థం చేసుకోవాలని జైశంకర్ తెలుపగా.. నేరస్థులకు శిక్ష పడాల్సిందేనని క్వాడ్ పేర్కొంది. ప్రపంచం ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదని పిలుపునిచ్చింది. క్వాడ్ అన్నిరకాల ఉగ్రవాద చర్యలను, హిసాత్మక తీవ్రవాదాన్ని, సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్నింటినీ ఖండిస్తుందని తెలిపింది. జమ్మూకశ్మీర్ (Jammu&Kashmir)లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ దేశస్తుడు మరణించడంపై ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది.
"బాధితుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. గాయపడిన వారంతా త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. ఇంతటి తీవ్రమైన చర్యకు పాల్పడిన వారిని, వారికి ఆర్థిక సహాయం చేసినవారిని ఎలాంటి ఆలస్యం లేకుండా శిక్షించాలని కోరుతున్నాం. అంతర్జాతీయ చట్టం & సంబంధిత UNSCR ప్రకారం వారి బాధ్యతలకు అనుగుణంగా అన్ని సంబంధిత అధికారులతో చురుకుగా సహకరించాలని UN సభ్య దేశాలను కోరుతున్నాం." అని క్వాడ్ ప్రకటనలో పేర్కొంది.
అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలకు చెందిన మంత్రులతో జైశంకర్ భేటీ అయ్యారు. ఇండో - పసిఫిక్ లో స్థిరత్వాన్ని ఈ క్వాడ్ సమావేశం బలోపేతం చేస్తుందని, సమకాలీన అవకాశాలు, సవాళ్లపై చర్చించామని తెలిపారు. అలాగే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ వైఖరిని క్వాడ్ భాగస్వాములు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. అణ్వాయుధాల పేరుతో పాక్ చేస్తున్న బ్లాక్ మెయిలింగ్ కు భారత్ లొంగదని పేర్కొన్నారు.






