- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
QR code:నెటిజన్ ఐడియా అదుర్స్.. ఇండియాలో సాధ్యమేనా?
పట్టణాల అభివృద్ధి విషయంలో నెటిజన్ ఐడియా వైరల్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో పట్టణాల అభివృద్ధి వేగంగా జరుగుతోంది. స్మార్ట్ సిటీల (Smart city) పేరుతో నగరాలు, పట్టణాల డెవలప్ మెంట్ పై ప్రభుత్వాలు ఫోకస్ పెడుతున్నాయి. అయితే ఇదంతా ఒక వైపే. మరో వైపు అధివృద్ధికి ఆమడదూరంలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న నగర బస్తీలు అనేకం ఉన్నాయి. వాటితో పాటు మెయిన్ సెంటర్లు అనుకునే చోట్లలోనే పలు సమస్యలు స్వాగతం పలుకుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా ఇతర నగరాలతో తమ నగరాన్ని వైవిధ్యంగా ఉంచాలనుకునే వారికోసం అర్జిత్ సోని అనే యూజర్ ఓ ఐడియాను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మీ నగరాలలో మార్పు తీసుకురావాలనుకునే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఇక్కడ ఓ సింపుల్ ఐడియా ఉంది. మీ నగరంలోని వీధులకు క్యూఆర్ కోడ్ (QR Code) ఏర్పాటు చేయాలని సూచించారు. దాంతో ఆ వీధిలో (street) ఉన్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులను ట్యాగ్ చేసి రిపోర్టు చేయమనాలి. ఈ ప్రతి ఫిర్యాదుకు ఓ టికెట్ రైజ్ చేయాలి. అలా వచ్చిన సమస్యను పరిష్కారం చూపి దానిపై ఫిర్యాదు దారుడి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించాడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జవాబుదారీతనంతో కూడిన టికెట్ మేనేజ్మెంట్ సాఫ్ట్ వేర్ ను రూపొందించాలి. సమస్యలను పరిష్కరించే అధికారులను ప్రమోషన్లు ఇవ్వాలని పని చేయని వారికి ఉద్వాసన పలకాలని సూచించాడు.
నెటిజన్ల రియాక్షన్:
ఈ సలహాపై పలువురు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ ఐడియా సూపర్ గా ఉందని కొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుంటే ఇది ఇండియాలో సాధ్యమేనా అని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి కొందరు దాదాపు ఈ తరహాలోనే పలు నగరాల్లో ఇప్పటికే వ్యవస్థలు ఉన్నాయని కానీ అమలు అంత తేలిక కాదని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ క్యూఆర్ కోడ్ ఐడియా ప్రస్తుతం ఆసక్తిగా మారింది.






