Puthin: భారత్, చైనాలపై సుంకాలు.. అమెరికాపై పుతిన్ ఆగ్రహం

by B.Srinivas |

అమెరికాపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకాలు, ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని తెలిపారు.

Puthin: భారత్, చైనాలపై సుంకాలు.. అమెరికాపై పుతిన్ ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాపై రష్యా అధ్యక్షుడు పుతిన్ (Puthin) ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకాలు, ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని తెలిపారు. ఆసియాలోని రెండు అతిపెద్ద శక్తులను అణగదొక్కడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. చైనా పర్యటనలో ఉన్న పుతిన్ ఆ దేశ విక్టరీ పరేడ్‌కు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్ చైనాలు కీలక భాగస్వాములని ఈ రెండు దేశాలను బలహీన పర్చేందుకే ట్రంప్ ఆర్థిక ఒత్తిడిని ఆయుధంగా చేసుకుంటున్నారని తెలిపారు. ‘సుమారు1.5 బిలియన్ల జనాభా కలిగిన భారత్, చైనా వంటి దేశాలు బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఆ దేశాలకు సొంత రాజకీయ యంత్రాంగాలు, చట్టాలు కూడా ఉన్నాయి. వాటిని శిక్షించాలని చూస్తే మీరే కష్టకాలంలోకి వెళ్తారు. ఈ విషయాన్ని ట్రంప్ అర్థం చేసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. వసల వాద యుగం ముగిసిందని, బహుళ ధ్రువ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సమాన హక్కులు పొందాలని, అంతర్జాతీయ చట్టం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. రష్యా చమురు కొనుగోలు చేసినందుకు భారత్ పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Next Story