Puthin: పుతిన్, జిన్‌పింగ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై డిస్కషన్

by B.Srinivas |

రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్‌లు మంగళవారం భేటీ అయ్యారు.

Puthin: పుతిన్, జిన్‌పింగ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై డిస్కషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు పుతిన్ (Puthin), చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్‌ (Jinping) లు మంగళవారం భేటీ అయ్యారు. చైనా రాజధాని బీజింగ్‌లో సమావేశమైన ఇరువురు నేతలు రెండు దేశాల సంబంధాలపై చర్చించారు. మాస్కో, బీజింగ్ సంబంధాలు మెరుగైన స్థాయిలో ఉన్నాయని ప్రశంసించారు. తాము ఎల్లప్పుడూ కలిసే ఉన్నామని, ముందు కూడా ఇలాగే ఉంటామని పుతిన్ తెలిపారు. చైనా-రష్యా సంబంధాలు అంతర్జాతీయ మార్పులను తట్టుకున్నాయని జిన్ పింగ్ తెలిపారు. మరింత న్యాయమైన, సహేతుకమైన ప్రపంచ పాలన వ్యవస్థ నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి మాస్కోతో సహకారాన్ని మరింతగా పెంచుకుంటామని స్పష్టం చేశారు. అంతకుముందు పుతిన్ పాక్ ప్రధాని షరీఫ్‌తోనూ సమావేశమయ్యారు. కాగా, రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో చైనా బుధవారం విక్టరీ పరేడ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి పుతిన్ సహా పలు దేశాధినేతలు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

Next Story