- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్రౌపతి ముర్ము, ప్రధాని మోడీ ఆయనకు ఘనస్వాగతం పలికారు.

దిశ, వెబ్ డెస్క్: రష్యా అధ్యక్షుడు పుతిన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్రౌపతి ముర్ము, ప్రధాని మోడీ ఆయనకు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు గౌరవ వందనంతో సైనికులు వెల్ కమ్ చెప్పారు. ఇదిలా ఉంటే పుతిన్ నాలుగేళ్ల తరవాత మళ్లీ ఇండియాకు అధికారిక పర్యటనకోసం వచ్చారు. ఈ పర్యటనలో భారత్‌తో రష్యా కొన్నిఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. భారత్ పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో పుతిన్ పర్యటన సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఈ పర్యటన ఇండియా రష్యా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. ఇక ఇండియాలో అడుగుపెట్టే ముందు ఓ ఇంటర్వ్యూలో పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సుంకాలకు మోడీ లొంగిపోయే వ్యక్తి కాదన్నారు. రష్యా నుండి ఇండియా ఇంధనం కొనుగోలు చేస్తే ట్రంప్ సుంకాలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా రష్యా నుండి అణుఇంధనాన్ని కొనుగోలు చేస్తుందని మరి భారత్ ఎందుకు కొనుగోలు చేయవద్దని ప్రశ్నించారు. ఇక గురువారం పుతిన్ ఇండియాకు రాగా రెండు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు.






