పూరీ ఆలయానికి దేశవ్యాప్తంగా వేల ఎకరాల భూములు.. వివరాలు చెప్పిన మంత్రి

by Naga Rani Yarlagadda |

ఒడిశాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ శ్రీక్షేత్రం.

పూరీ ఆలయానికి దేశవ్యాప్తంగా వేల ఎకరాల భూములు.. వివరాలు చెప్పిన మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ శ్రీక్షేత్రం. అక్కడున్న జగన్నాథ ఆలయానికి రాష్ట్రంలో 60 వేల ఎకరాలకు పైగా భూములు ఉన్నట్లు ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. శనివారం అసెంబ్లీలో పూరీ జగన్నాథస్వామి ఆలయానికి చెందిన ఆస్తుల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దేశంలోని మరో 6 రాష్ట్రాల్లో 395 ఎకరాలున్నట్లుగా పేర్కొన్నారు.

12వ శతాబ్దం నాటి ఆలయం.. శ్రీ జగన్నాథ ఆలయ చట్టం - 1956 ప్రకారం న్యాయశాఖ నిర్వహణల ఉంది. ఈ ఆలయానికి రాష్ట్రంలోని 24 జిల్లాల్లో మొత్తం 60,426.94 ఎకరాల భూమి స్వామివారి పేరిట ఉందని వివరించారు. 395.25 ఎకరాల్లో పశ్చిమ బెంగాల్ లో 322.93 ఎకరాలు, మహారాష్ట్రలో 28.21 ఎకరాలు, మధ్యప్రదేశ్ లో 25.11 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ లో 17.02 ఎకరాలు, ఛత్తీస్ గఢ్ 1.70 ఎకరాలు, బిహార్లో 0.27 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. వీటిలో 98,061.79 ఎకరాకు సంబంధించిన రివైజ్డ్ రికార్డులు పూరీలోని జగన్నాథ ఆలయ అధికారుల వద్దనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఆలయ భూముల్లో7 జిల్లాల్లోని 169.86 ఎకరాల భూమి కబ్జాకు గురికాగా.. వాటిపై జగన్నాథ ఆలయ చట్టం కింద 974 కేసులు నమోదైనట్లు తెలిపారు.

Next Story