Panjab: పంజాబ్ పట్ల కేంద్రం వివక్ష.. సీఎం భగవంత్‌మాన్ ఫైర్

by B.Srinivas |

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హర్యానాతో నీటి పంపిణీ వివాదం కొనసాగుతున్న క్రమంలో పంజాబ్ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఫైర్ అయ్యారు.

Panjab: పంజాబ్ పట్ల కేంద్రం వివక్ష.. సీఎం భగవంత్‌మాన్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagavanth mann) హర్యానా (Haryana)తో నీటి పంపిణీ వివాదం కొనసాగుతున్న క్రమంలో పంజాబ్ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఫైర్ అయ్యారు. ఏ రాష్ట్రానికి ఇవ్వడానికి పంజాబ్ వద్ద మిగులు జలాలు లేవన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి సట్లెజ్-యమునా లింక్ కు బదులుగా యమునా-సట్లెజ్ లింక్ కాలువను నిర్మించాలని డిమాండ్ చేశారు. రావి, బియాస్, సట్లెజ్ నదులు ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. నీతి ఆయోగ్ (Nithi aayog) సమావేశంలో భాగంగా భగవంత్ మాన్ ప్రసంగించారు. మిగులు నీటి నుంచి లోటు బేసిన్లకు నీటిని మళ్లించాలన్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ మధ్య కుదిరిన యమునా-సట్లెజ్ లింక్ ఒప్పందపై స్పందిస్తూ.. ఈ అగ్రిమెంట్ ప్రకారం యమునా నీటిలో మూడింట రెండు వంతులు పంజాబ్‌కు లభించాలని, అయితే ఒప్పదంలో యమునా నీటి ద్వారా సాగునీరు అందించే ప్రాంతం గురించి ప్రస్తావించలేదన్నారు. ఈ సమస్యను కేంద్ర పరిష్కరించాలని కోరారు.

కేంద్రం నిధులు రిలీజ్ చేయాలి: తమిళనాడు సీఎం స్టాలిన్

నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న బీజేపీయేతర సీఎంలు పలు సమస్యలను లేవనెత్తారు. రాష్ట్రాలకు మరిన్ని నిధులు విడుదల చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ (Stalin) డిమాండ్ చేశారు. తమిళనాడుతో సహా అన్ని రాష్ట్రాలపై వివక్ష లేకుండా సహకారం అందించాలన్నారు. ‘రాష్ట్రాలు తమకు రావాల్సిన నిధులను సరిగ్గా పొందేందుకు పోరాడటం, వాదించడం లేదా వ్యాజ్యం వేయడం సరైంది కాదు. దీని వల్ల రాష్ట్రం, దేశం రెండింటి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటాను 50శాతానికి పెంచాలన్నారు. దీనిని కేంద్రం సీరియస్‌గా పరిగణించాలని సూచించారు. కేంద్రం నుంచి పన్ను వికేంద్రీకరణ జరిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తుందన్నారు.

Next Story