- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Punjab Blast: పంజాబ్ లో గ్రనేడ్ దాడి.. బిష్ణోయ్ గ్యాంగ్ తో లింకులు
పంజాబ్‌లో బీజేపీ నేత మనోరంజన్ కాలియా ఇంటి వద్ద గ్రనేడ్ దాడి కేసులో సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి వెనుక మస్టర్ మైండ్ లారెన్స్ బిష్ణోయ్ స్నేహితుడు జీషాన్ అక్తర్ అని పోలీసులు అనుమానిస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లో బీజేపీ నేత మనోరంజన్ కాలియా ఇంటి వద్ద గ్రనేడ్ దాడి కేసులో సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి వెనుక మస్టర్ మైండ్ లారెన్స్ బిష్ణోయ్ స్నేహితుడు జీషాన్ అక్తర్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. జీషాన్ కు ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులోనూ కీలక నిందితుడిగా ఉన్నాడు. అయితే, పంజాబ్ లో మతకలహాలు రేపేందుకే పాక్ ఐఎస్ఐ కుట్ర పన్నిందని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ నేత ఇంటి సమీపంలో గ్రానైడ్ దాడి జరిగిందని అనుమానిస్తున్నారు.
బీజేపీ నేత ఇంటి వద్ద పేలుడు
పంజాబ్‌లోని జలంధర్‌లో సోమవారం అర్ధరాత్రి బీజేపీ నేత, మాజీ మంత్రి మనోరంజన్ కాలియా ఇంటి వద్ద గ్రనేడ్ దాడి జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పేలుడు శబ్దం రాగానే..తన గన్ మెన్ ను పోలీస్ స్టేషన్ కు పంపి సమాచారమిచ్చినట్లు కాలియా తెలిపారు. పేలుడుకు సంబంధించిన వివరాలను పోలీసులకు తెలిపానని పేర్కొన్నారు. దీనిపై, వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ విజువల్స్ ని పరిశీలిస్తున్నారు. కాగా.. ఫోరెన్సిక్ బృందాలు కూడా ఘటనాస్థలి నుంచి ఆధారాలు సేకరించాయి. అయితే, దుండగులు రిక్షాలో వచ్చి పేలుడు చేపట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ఘటన తర్వాత కేంద్ర మంత్రి రవ్‌నీత్ బిట్టూ అక్కడకు చేరుకొని కాలియాతో మాట్లాడారు. పంజాబ్‌లో ఈ రకంగా గ్రనేడ్‌లు వాడటం అసాధారణమని.. పరిస్థితి చూస్తుంటే అవి తేలిగ్గానే దొరుకుతున్నట్లు తెలుస్తోందని బిట్టూ అన్నారు.






