Child Pornography : ఇంట్లో 134 చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు.. ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీత అరెస్ట్

by Sathputhe Rajesh |   (  Updated:2025-01-17 09:34:56  IST  )

ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు గెలుచుకున్న కార్టూనిస్ట్ డారిన్ బెల్‌(49)ను అమెరికాలోని కాలిఫోర్నియా పోలీసులు అరెస్ట్ చేశారు.

Child Pornography : ఇంట్లో 134 చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు.. ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీత అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు గెలుచుకున్న కార్టూనిస్ట్ డారిన్ బెల్‌(49)ను అమెరికాలోని కాలిఫోర్నియా పోలీసులు అరెస్ట్ చేశారు. 134 చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు ఇంట్లో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్ ఆన్‌లైన్ అకౌంట్ నుంచి 134 చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను షేర్ చేసినట్లు గుర్తించాం. దీంతో బుధవారం ఉదయం అతని ఇంట్లో సోదాలు నిర్వహించాం. దాడుల్లో చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు లభ్యమయ్యాయి. అందులో కొన్నింటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి క్రియేట్ చేసినట్లు గుర్తించాం. సోదాల అనంతరం బెల్‌ను కస్టడీకి తరలించాం. చైల్డ్ సెక్స్ మెటిరియల్ కలిగి ఉన్న అభియోగాలతో అతనిపై కేసు నమోదు చేశాం. సాక్రమెంటో కౌంటీ పరిధిలో ఏఐ టెక్నాలజీని వాడి పోర్నగ్రఫీ వీడియోలు తయారు చేసిన ఘటన తొలిసారిగా వెలుగు చూసినట్లు పోలీసులు తెలిపారు. ఫ్రీలాన్స్ కార్టూనిస్ట్‌గా పనిచేస్తున్న బెల్ 2019లో పులిట్జర్ అవార్డును గెలుచుకున్నాడు. 1995 నుంచి పలు వార్తాపత్రికలకు బెల్ కార్టూన్‌లు అందిస్తున్నాడు.

Next Story